

నవతరం, శంఖవరం: కాకినాడ జిల్లా
శంఖవరం మండలం వజ్రకూటం గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో గౌరవ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ప్రేమ, దయ, జాలి, కరుణ వంటి పదాలకు ప్రతిరూపం జీసస్ అన్నారు. శాంతి దూత అయిన జీసస్ పుట్టినరోజు వేడుకలను ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండుగ మాదిరిగా జరుపుకుంటారని అన్నారు. స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని స్థానిక చర్చ్ యాజమాన్యానికి లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తెలుగు దేశం పార్టీ మండల నాయకులు పాల్గొనడం జరిగింది.